ఇక పాన్ ఇండియా స్టార్ హీరో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తమిళ నాట మాత్రమే కాకుండా దేశావ్యాప్తంగా కూడా అగ్ర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే తమిళ తలైవాగా పేరు సంపాదించారు.ఇక ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు పొందిన సూపర్ స్టార్ రజినీ కాంత్ ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో అధిక మొత్తంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను దినోత్సవం సందర్భంగా అధికారులు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలోనే అధికారులు సూపర్ స్టార్ రజనీ కాంత్ ను సత్కరిస్తూ అభినందించారు.ఈ విధంగా తమిళ ఇండస్ట్రీ నుంచి అధికంగా ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తి గా రజనీ కాంత్ నిలవడంతో ప్రతి ఒక్కరు కూడా ఈయన ఆస్తుల గురించి ఆరా తీస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలలో నటించి కొన్ని కోట్లు సంపాదించినప్పటికీ ఆయన ఎంతో సాదాసీదాగా కనిపిస్తారు. అయితే ఈయన కూడా ఇక ఖరీదైన ఇల్లు కార్లు బంగ్లాలు కొనుగోలు చేశారు. ఇకపోతే పలు సర్వేల ప్రకారం సూపర్ స్టార్ రజనీకాంత్ నికర ఆస్తులు విలువ సుమారు 400 కోట్లు ఉంటుందని అంచనా.ఇంకా రజనీకాంత్ స్థిరచరాస్తుల విషయానికి వస్తే ఈయనకు పోలీస్ గార్డెన్ లోనే ఎంతో ఖరీదైన ఇల్లు ఉందని సమాచారం తెలుస్తోంది.ఈ ఇంటి విలువ వచ్చేసి 35 కోట్లు. ఇంకా అలాగే తన గ్యారేజ్ లో ఎంతో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇక ఈ కార్లు సుమారు 30 కోట్ల వరకు కూడా విలువ చేస్తాయని సమాచారం. ఈ విధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన హస్తిరచరాస్తులు కూడా వందల కోట్లలో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇలా ఎన్నో వందల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ ఈయన ప్రభుత్వానికి అత్యధికంగా టాక్స్ చెల్లించే వ్యక్తిగా ఈ ఏడాది నిలవడం గమనార్హం.