'క్రాక్'
సినిమా లాంటి
బ్లాక్ బస్టర్ హిట్ తరువాత
రవితేజ 'ఖిలాడి' సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. మరోసారి కొత్త
డైరెక్టర్ కి అవకాశం ఇస్తూ నటించిన తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'.'దమ్ము'
సినిమా తరువాత చాన్నాళ్ల తర్వాత వేణు తొట్టెంపూడి మళ్ళీ తెరపై కనిపించిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ ప్రేక్షకుల్ని అంతగా అలరించలేకపోయాయి. మరి
సినిమా అయినా ఆకట్టుకుందో లేదో ఇపుడు తెలుసుకుందాం..!!
రవితేజ కెరీర్ లో చేసిన బ్యాడ్ ఫిలిమ్స్ & క్యారెక్టర్స్ లిస్ట్ లో 'రామారావు ఆన్ డ్యూటీ'
సినిమా కూడా చేరిపోతుంది. ఓ సాధారణ
గవర్నమెంట్ ఉద్యోగికి ఈ రేంజ్ పవర్స్ ఉంటాయా అని అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంకా అలాగే.. క్యారెక్టర్ బిహేవియర్ అనేది కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. వేణు తొట్టెంపూడిని చాన్నాళ్ల తర్వాత మళ్ళీ చూడడం ఆనందంగా ఉన్నా కానీ ఆయన క్యారెక్టర్ కి సరైన జస్టిఫికేషన్ లేకపోవడం మాత్రం బాధాకరం.హీరోయిన్స్ సెలక్షన్ లో అయితే
రవితేజ టేస్ట్ బ్యాడ్ అనేది ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. ఇక ఈ చిత్రంతో మరోమారు అది రుజువైంది. ఇక
తమిళ నటుడు
జాన్ విజయ్ ఇంకా తనికెళ్ళ భరణీలు పర్వాలేదనిపించుకున్నారు.సామ్ సి.ఎస్ అందించిన పాటలు సినిమాకి చాలా పెద్ద మైనస్ అనే చెప్పాలి.ఒక్క పాట కూడా
ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. కేవలం నేపధ్య సంగీతం మాత్రం పర్వాలేదు అనిపించుకున్నాడు.
ఇక
సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ ఒక్కటే సినిమాకి సేవింగ్ గ్రేస్. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కూడా సోసోగా ఉన్నాయి. దర్శకుడు శరత్ మండవ రాసుకున్న కథలో దమ్ము అయితే ఉంది కానీ..ఆ కథను తెరకెక్కించిన విధానం మాత్రం అస్సలు బాగోలేదు. స్క్రీన్ ప్లే & డైలాగ్స్ ఏమాత్రం కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇలాంటి
థ్రిల్లర్ ను తెరకెక్కించడానికి కావాల్సింది ఆకట్టుకునే కథనం. ఆ కథనమే మిస్ అయ్యేసరికి అటు
రవితేజ ఫార్మాట్ ఎంటర్టైన్మెంట్ లేక సినిమాలో కంటెంట్ లేక 'రామారావు ఆన్ డ్యూటీ'
సినిమా చతికిలపడింది.