'భోళా శంకర్' మూవీ అవుట్ పుట్ బాగా వస్తుంది... అనిల్ సుంకర..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి క్రేజ్ తెచ్చుకున్న నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనిల్ సుంకర టాలీవుడ్ స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే , మీడియం రేంజ్ హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమా నిర్మించిన అనిల్ సుంకర, అల్లరి నరేష్ తో బంగారు బుల్లోడు సినిమాను కూడా నిర్మించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనిల్ సుంకర తన ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రెండు భారీ మూవీ లను తెరకెక్కిస్తున్నాడు. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ కాగా రెండవది అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్. ఇందులో ఏజెంట్ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ సుంకర తాను ప్రస్తుతం నిర్మిస్తున్న భోళా శంకర్ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో అనిల్ సుంకర మాట్లాడుతూ ... దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ మూవీ ని చాలా సూపర్ గా తీస్తున్నారని , చెల్లెలి సెంటిమెంట్ ప్రధానంగా భోళా శంకర్ సినిమా సాగినప్పటికీ మెగా అభిమానులతో పాటు మాములు ఆడియన్స్ అందరూ కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు కూడా ఈ సినిమాలో ఉండనున్నట్లు అనిల్ సుంకర చెప్పారు. భోళా శంకర్ మూవీ అవుట్ ఫుట్ ప్రస్తుతం సూపర్ గా వస్తుందని ,  వచ్చే సంవత్సరం ఈ మూవీ రిలీజ్ కానుందని ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ కొడుతుందని తాజా ఇంటర్వ్యూలో అనిల్ సుంకర అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: