'సీతా రామం' తమిళ హక్కులను దక్కించుకున్న భారీ సంస్థ..!

Pulgam Srinivas
దుల్కర్ సల్మాన్ హీరోగా టాలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరు అయిన హను రాఘవపూడి దర్శకత్వం లో సీతా రామం అనే ఒక ప్రేమ కథ మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే . ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ సరసన మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటించింది .


ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలలో దుల్కర్ సల్మాన్ , మృణాళినీ ఠాకూర్  జంట బాగుంది అంటూ ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు కూడా వీరిద్దరి జంటకు దక్కాయి. ఈ మూవీ లో రష్మిక మందన కీలక పాత్రలో నటిస్తుండగా ,  భూమిక చావ్లా , సుమంత్  , గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళం లో కూడా మూవీ యూనిట్ విడుదల చేయబోతోంది. అందులో భాగంగా ఈ మూవీ తమిళ హక్కులను భారీ సంస్థ కొనుగోలు చేసింది. సీతా రామం  మూవీ తమిళ హక్కులను అక్కడి ప్రముఖ సంస్థ లలో ఒకటి అయిన  లైకా ప్రొడక్షన్స్ వారు దక్కించుకున్నారు.


తాజాగా సీతా రామం మూవీ  తమిళ్ ట్రైలర్ ను తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన కార్తీ లాంచ్ చేసారు.  కాగా ఈ మూవీ తమిళ్ హక్కులను దక్కించుకోవడం,  అలానే ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ  గ్రాండ్ గా విడుదల చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది అంటూ తాజాగా లైకా సంస్థ తమ సోషల్ అకౌంట్స్ లో అఫీషియల్ పోస్ట్ ను రిలీజ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: