ఆలియా భట్- షెఫాలీ షా- విజయ్
వర్మ తదితరులు నటించిన డార్క్
కామెడీ సినిమా డార్లింగ్స్. బోలెడంత ఫన్.. థ్రిల్స్..సీక్రెట్స్ ఇంకా గట్సీ డ్రామాతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. 'డార్లింగ్స్' సినిమాని గౌరీ ఖాన్-
అలియా భట్ -గౌరవ్
వర్మ నిర్మించారు. కొత్త దర్శకుడు జస్మీత్ కె రీన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డార్లింగ్స్ టీజర్
పోస్టర్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత ట్రైలర్ పైనా ఆసక్తి పెరిగింది. ఇక దానికి తగ్గట్టే ట్రైలర్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ చిత్రం
నెట్ ఫ్లిక్స్ లో 2022 ఆగస్టు 5 వ తేదీన ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.ఇక నిజమైన
ప్రేమ కోసం వెతుకుతూ.. సంఘంలోని రాక్షసులతో పోరాడుతూ.. ముంబైలో కాలు మోపిన తల్లీ కూతుళ్ల జీవితాల్లో అసలు ఏం జరిగింది? అనే ఆసక్తికర కథతో ఈ
మూవీ తెరకెక్కింది. ఇందులో ముస్లిమ్ యువతిగా
ఆలియా భట్ నటిస్తోంది.ఇక తనతో జీవితం పంచుకుంటున్న యువకుడిని మరీ అలా కిడ్నాప్ చేసి చిత్రహింసలకు ఎందుకు గురి చేస్తోంది? అలాగే తనకు అతడు చేసిన అన్యాయం ఏమిటో తెరపైనే చూడాలి.
ముస్లిమ్ యువతి అయినా మోడ్రన్ యువతి వేషధారణతో ప్రత్యక్షమవుతూ
ఆలియా భట్ పాత్రలో రకరకాల షేడ్స్ క్యూరియాసిటీని పెంచాయి.అలియా భట్ ఈ చిత్రంతో తన సొంత బ్యానర్ ఎటర్నల్ సన్ షైన్ ని కూడా ప్రారంభించింది. ఇంకా
ఆలియా మాట్లాడుతూ.. డార్లింగ్స్
సినిమా నాకు వెరీ స్పెషల్.. నేను స్క్రిప్ట్ చదివిన క్షణం కేవలం నటిగానే కాకుండా పెద్దగా ఇంకేదైనా చేయాలనుకున్నాను. ఇలాంటి ప్రత్యేకమైన కథలను ప్రేక్షకులకు అందించడంలో మా అందరి పాత్ర కూడా ఉంది. కొంతమంది అద్భుతమైన సహ-నటులు.. భాగస్వామ్య నిర్మాతలు ఇంకా దర్శకుడు జస్మీత్ ల కృషిని గుర్తు చేసుకోవాలి.ఇక
నెట్ ఫ్లిక్స్ లో ఈ
మూవీ విడుదలవుతోంది'' అని తెలిపారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ
సినిమా తెలుగు ఇంకా
తమిళ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది.