"ఛలో" సినిమాతో
టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన
రష్మిక మందన మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టి యూత్ లో మంచి పాపులరిటీని దక్కించుకుంది. ఇక ఆ
సినిమా తరువాత చిన్న
హీరోయిన్ గా పలు సినిమాలు చేస్తున్న క్రమంలో ఈ బ్యూటీకి సూపర్ స్టార్ మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరూ" వంటి రూపంలో లక్కీ ఛాన్స్ వచ్చింది. ఇక ఆ సినిమాతో
బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన
కన్నడ ముద్దుగుమ్మ
రష్మిక మందన్నా వరుస సినిమాలు చేస్తూ "పుష్ప" తో పాన్
ఇండియా హీరోయిన్ అయ్యి తగ్గేదే లే అంటోంది. టాలీవుడ్తో స్టార్డమ్ సంపాందించుకున్న ఈ అమ్మడు
కోలీవుడ్ ఇంకా బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంది.ముఖ్యంగా 'పుష్ప' మూవీతో అయితే తెలుగు, తమిళం,
హిందీ ఆడియెన్స్ల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు ఇంకా తమిళ్లో
విజయ్ నటిస్తున్న 'వారీసు' (వారసుడు) చిత్రంలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.
అలాగే 'పుష్ప 2' సినిమాతో పాటు మరికొన్ని
హిందీ ఇంకా
కోలీవుడ్ ప్రాజెక్టులు కూడా చేస్తోంది.ఇక హిందీలో చేసిన 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' సినిమాల చిత్రీకరణ కూడా పూర్తి అయింది. తాజాగా 'గుడ్ బై'
సినిమా విడుదల తేదిని కూడా ఖరారు చేసింది
మూవీ యూనిట్.
కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో
బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా, ఎల్లీ అవ్రాం, సునీల్ గ్రోవర్, సాహిల్ మెహతా తదితరులు కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఈ
మూవీ వరల్డ్వైడ్గా అక్టోబర్ 7 వ తేదీన విడుదల కానుంది. ఇక
ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సినిమాకు వికాస్ బహల్ దర్శకత్వం వహించారు.అంత్యక్రియల చుట్టూ 'గుడ్ బై'
మూవీ కథ జరుగుతుందని బాలీవుడ్
మీడియా తెలుపుతుంది.ఈ సినిమాతో
రష్మిక చాలా ఆశలే పెట్టుకుంది.ఇక ఈ
సినిమా రష్మికకి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.