రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వైట్ షర్ట్ ఎందుకో..?

Satvika
తెలుగు స్టార్ హీరో మాస్ మహరాజ ఇప్పుడు వరుస వరుస సినిమాలలొ నటిస్తూ బిజిగా ఉన్నారు.ప్రస్తుతం ఆయన రామారావు ఆన్ డ్యూటీ లో నటిస్తున్నారు.. ఇటీవల షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తీ చక చకా పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29 న విడుదల కానుంది.శరత్ మాండవ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ ఎం.ఆర్‌.ఓ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఓ సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ అవినీతి రాజకీయ నాయకుల భరతం ఎలా పట్టాడనేదే సినిమా..ఇందులో రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్‌ గా నటించారు.

ఇప్పటికే ఈ చిత్ర పలు సాంగ్స్, ట్రైలర్ , టీజర్ ఆకట్టుకోగా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ గా గ్రాండ్ గా జరపబోతున్నారు. హైదరాబాద్ - ఫిల్మ్ నగర్ .. జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుక నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. రవితేజ అభిమానులు 'వైట్ షర్ట్స్'తో రావాలని ఈ పోస్టర్ ద్వారా చెప్పారు. ఈ సినిమాతోనే తొట్టెంపూడి వేణు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో నాజర్ .. పవిత్ర లోకేశ్ కనిపించనున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ  అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా వదిలిన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.. విడుదలైన 24 గంటల్లోనే 11 మిలియన్ల వ్యూస్ రాబట్టింది రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్. తద్వారా రవితేజ కెరీర్ లో ఇలా విడుదలైన 24 గంటల్లో ఇంతలా వ్యూస్ సంపాదించిన తొలి ట్రైలర్‌గా రికార్డు నమోదు చేసింది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్స్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 29న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు..ఇప్పటివరకు వదిలిన అప్‌డేట్స్ చూస్తుంటే ఈ సినిమాతో రవితేజ మరోసారి బాక్సాఫీస్ దాడి చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. 1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు...ఈ సినిమా అన్నా రవితేజకు కలిసి వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: