టాలీవుడ్
సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి, ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన వారు చాలా మందే ఉన్నారు. కొంతమంది అయితే ఇండస్ట్రీకే కాదు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు కూడా.ఇక అలాంటివారిలో దివంగత
హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ కూడా ఒకరు. ఇకపోతే తను కెరియర్ మొదట్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. 2001 వ సంవత్సరంలో
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన
నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక
టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న
ఆర్తి అగర్వాల్ నాలుగు సంవత్సరాల పాటు ఫుల్ బిజీగా మారిపోయి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.కెరియర్ మంచి పొజిషన్లో ఉండగానే
హీరో తరుణ్ తో
ఆర్తి అగర్వాల్ ప్రేమలో ఉందంటూ అప్పట్లో వార్తలు బాగా వైరల్ అయ్యాయి.ఇక వీరిద్దరి కాంబినేషన్లో నువ్వు లేక నేను లేను, సోగ్గాడు సినిమాలు వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా
సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లోనే తెరకెక్కడం గమనార్హం. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య
ప్రేమ బాగా చిగురించింది అని ,
ఆర్తి అగర్వాల్ పూర్తిస్థాయిలో
తరుణ్ ను ప్రేమించిందనే వార్తలు కూడా వినిపించాయి.దాంతో
ఆర్తి అగర్వాల్ కి
సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.
తరుణ్ వల్లే
ఆర్తి అగర్వాల్ కెరియర్ లో ఓడదుడుకులు ఎదుర్కొంటుందని మీడియాలో అనేక రకాల వార్తలు రావడంతో ఆమె విషం తాగి ఆత్మహత్యయత్నం చేసింది. దాంతో
తరుణ్ తో
ఆర్తి అగర్వాల్ పెళ్లికి అతడి కుటుంబ సభ్యులు నిరాకరించారని ఇక ఆ కారణం వల్ల ఆమె విషం తాగిందని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో
తరుణ్ పై వచ్చిన ఆరోపణలకు అతడి తల్లి సీనియర్
హీరోయిన్ రోజా రమణి స్పందించడం జరిగింది.ఇక
రోజా రమణి మాట్లాడుతూ..
ఆర్తి అగర్వాల్ చాలా మంచి అమ్మాయి. ఆమెను నేను ఒక
సినిమా ఫంక్షన్ లో కలిసి మాట్లాడాను.తరుణ్,
ఆర్తి అగర్వాల్ మంచి ఫ్రెండ్స్ అని వారి మధ్య ఎలాంటి
ప్రేమ లేదని ఆ
అమ్మాయి కూడా చెప్పింది. ఇక
తరుణ్,
ఆర్తి కెరియర్ లో బాగా స్థిరపడ్డారని.. వారు
పెళ్లి చేసుకుంటే ఎవరు మాత్రం అడ్డు వస్తారని కూడా ఆమె తెలిపింది. ఇంటి నుండి వెళ్లిపోయి
పెళ్లి చేసుకున్నా ఎవరూ ఆపుతారు అంటూ కూడా ప్రశ్నించింది
రోజా రమణి. ఇక
ఆర్తి అగర్వాల్ విషం తాగడానికి కారణం
తరుణ్ కాదని
రోజా రమణి చెప్పింది. ఆఖరికి
ఆర్తి అగర్వాల్ ఎన్నారై ను వివాహం చేస్తున్నప్పటికీ ఆ బంధం అనేది నిలవలేకపోయింది.ఆర్తి చివరికి తుది శ్వాస విడిచింది.