ఫస్ట్ ఎంట్రీతోనే పవన్ పై మహేష్ గెలుపు!

Purushottham Vinay
ఇక టాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతూ ఉండడం ఎప్పుడు నుంచో కొనసాగుతూ వస్తుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఇలాంటి పోటీ ఉన్నప్పుడే వినూత్నమైన సినిమాలు తెరమీదికి వస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ అలరిస్తూ ఉంటాయి.ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలుగా కొనసాగుతూ పోటీ పడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లకు సంబంధించిన సినిమాలు ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఇక ఫ్యాన్స్ లో కూడా వీళ్లిద్దరి మధ్య పోటీ అనేది ఉంటుంది.అయితే ఇక మొదటిసారి వీరిద్దరి సినిమాలు 1999 వ సంవత్సరంలో బాక్సాఫీస్ ఫైట్ లోకి దిగాయి.అయితే పవన్ కళ్యాణ్.. మహేష్ కంటే ముందే సినిమా ఎంట్రీ ఇచ్చి యూత్ లో క్రేజ్ సంపాదించుకుంటున్న రోజులవి. ఇక 1999 జులై 17 వ తేదీన పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరపైకి వచ్చి ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. పి ఎ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం కి ఈ సినిమా సరిగ్గా సరిపోయింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా ప్రీతి జింగానియా ఇంకా అతిథి గోవిత్రికర్ నటించారు.



ఇక అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు రాజకుమారుడు అనే సినిమాతో గ్రాండ్ గా ఫస్ట్ ఎంట్రీ ఇచ్చాడు. ఇది మహేష్ కి మొదటి సినిమా. ఒక కుటుంబంలోని ఎమోషన్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయిలో సూపర్ హిట్ అయింది. మహేష్ బాబు కెరీర్ కు ఈ సినిమా మంచి ప్లస్ పాయింట్ గా మారింది. జూలై 30 వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ఇలా రోజుల వ్యవధిలోనే విడుదలైన ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ సినిమాలు సాధించిన రికార్డులు చూస్తే.. తమ్ముడు సినిమా మొత్తం 56 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంటే.. ఇక రాజకుమారుడు సినిమా మొత్తం 66 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఇంకా రాజకుమారుడు 3 కేంద్రాల్లో వంద రోజులు ఆడితే తమ్ముడు విజయవాడ యువరాజ్ థియేటర్ లో 175 రోజులు ఆడింది. అలాగే రాజకుమారుడు 186 రోజులు పాటు రెండు థియేటర్లలో ఆడితే.. తమ్ముడు సినిమాని మాత్రం అప్పటికి థియేటర్ లలో నుంచి తీసేసారు.



ఇక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే నైజాంలో తమ్ముడు సినిమా 78 లక్షల వసూళ్లు చేస్తే.. రాజకుమారుడు సినిమా కూడా 78 లక్షలు రాబట్టింది. ఇక టోటల్ గా అన్ని ఏరియాస్ కలుపుకోని 9.4 కోట్ల షేర్ తమ్ముడు సినిమా రాబడితే రాజకుమారుడు సినిమా ఏకంగా 10.5 కోట్ల షేర్ రాబట్టి పై చేయి సాధించింది.ఈ విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ సినిమాతోనే రికార్డులు సాధించడం కాకుండా అప్పటికి యూత్ ఫాలోయింగ్లో దూసుకుపోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సైతం పోటీ పడి గెలిచాడు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య గట్టి పోటీ నడుస్తుంది. అది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: