ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే టాప్ హీరోల మధ్య ఊహించని స్థాయిలో పోటీ ఉంది. పాన్
ఇండియా మూవీతో
సక్సెస్ సాధిస్తే చాలు దాదాపుగా అందరు హీరోలకు 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించే సత్తా అయితే ఉంది.అయితే ఇక ఒక విషయంలో మాత్రం మా
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ బెటర్ అని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రేజ్ విషయంలో పవన్
కళ్యాణ్ కు పోటీనిచ్చే హీరోలు లేరని
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెబుతున్నారు.ఖుషి
సినిమా తర్వాత కొన్నేళ్ల పాటు
సక్సెస్ లేకపోయినా పవన్ కు ఫాలోయింగ్ ఇంకా రేంజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు.
రీమేక్ సినిమా అయిన
గబ్బర్ సింగ్ సినిమాతో కూడా పవన్
కళ్యాణ్ భారీ
బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారని
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇక
అత్తారింటికి దారేది సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం లీకైనా పవన్
కళ్యాణ్ ఆ సినిమాతో
ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్నారని పవన్ క్రేజ్ కు ఇదే నిదర్శనమని ఫ్యాన్స్ చెబుతున్నారు.పవన్
కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా అక్కడికి లక్షల సంఖ్యలో అభిమానులు చేరుకుంటున్నారని పవన్
కళ్యాణ్ పార్టీ గెలుపు కోసం పని చేసే అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఉన్నారని మరి కొందరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఒక్కో సినిమాకు పవన్
కళ్యాణ్ రికార్డ్ రేంజ్ లో తీసుకుంటున్నా పవన్ ఎక్కువ మొత్తం కూడా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్ హీరోనే కాదని రియల్ లైఫ్ హీరో కూడా అంటూ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే కేవలం పవన్
కళ్యాణ్ మాత్రమే
టాలీవుడ్ నెంబర్ 1
హీరో అంటే ప్రేక్షకులు ఒప్పుకోవట్లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్,
ప్రభాస్ వీళ్ళకి కూడా కోట్ల అభిమానులు వున్నారు. వీళ్ళకి కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది వుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వివిధ రకాల సేవా కార్యాక్రమాలు చేస్తున్నారు.కాకపొతే వున్న స్టార్ హీరోస్ లో వయసులో పవన్ పెద్దోడు కాబట్టి పైగా వీళ్ళ కంటే ముందుగా పవన్
కళ్యాణ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు కాబట్టి పవన్
కళ్యాణ్ పై ఇండస్ట్రీలో కొంచెం రెస్పెక్ట్ అనేది ఉంటుంది. కానీ నెంబర్ 1
హీరో అని చెప్పలేము. అది కేవలం రాబోయే సినిమాల రికార్డ్స్ మాత్రమే చెబుతాయి.పవన్
కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.