లైగర్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా...?
అయితే లైగర్ మూవీ కథ టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన కథ అని సమాచారం. ఈ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరనే ప్రశ్నకు బన్నీ, ఎన్టీఆర్ పేర్లు సమాధానంగా వినిపిస్తోందట..
బన్నీ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో దేశముదురు, ఇద్దరమ్మాయిలతో సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలలో దేశముదురు సినిమా హిట్ గా నిలిస్తే ఇద్దరమ్మాయిలతో సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇద్దరమ్మాయిలతో సినిమా సక్సెస్ సాధిస్తే లైగర్ సినిమా కథలో నటించాలని బన్నీ అనుకున్నారు. అయితే ఇద్దరమ్మాయిలతో సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదట.
ఆ తర్వాత తారక్ కూడా లైగర్ కథ విన్నారు. అయితే పూరీ జగన్నాథ్ కు తారక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదని సమాచారం అందుతోంది. పూరీ జగన్నాథ్ బన్నీ, ఎన్టీఆర్ కు కథ చెప్పిన సమయంలో హీరోకు, హీరోయిన్ కు కూడా నత్తి ఉంటుందని చెప్పారని సమాచారం. అయితే ప్రస్తుతం కథలో పూరీ జగన్నాథ్ మార్పులు చేశారా? లేక అదే విధంగా ఉంచారా? తెలియాల్సి ఉంది.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన లైగర్ విషయంలో చిత్రయూనిట్ కాన్ఫిడెన్స్ తో ఉంది. పూరీ జగన్నాథ్ సినీ కెరీర్ లో ఎక్కువరోజులు షూటింగ్ జరుపుకున్న సినిమా ఇదే కావడం విశేషం.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన పూరీ జగన్నాథ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా వరుస విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లైగర్ సినిమాతో పూరీ జగన్నాథ్ అంచనాలను అందుకుంటారో లేదో చూడాలి మరి...