ఇంగ్లీష్ టైటిల్స్ మ్యానియాలో తెలుగు సినిమాలు !
జూలై రెండవ వారంలో విడుదలైన రామ్ మూవీ ‘వారియర్’ టైటిల్ తో విడుదల అయితే ఈవారం విడుదల కాబోతున్న నాగచైతన్య మూవీకి ‘థాంక్యూ’ అన్న టైటిల్ పెట్టారు. ఈ నెలాఖరున విడుదల కాబోతున్న రవితేజా మూవీకి ‘రామారావు ఆన్ డ్యూటీ’ అన్న టైటిల్ ఫిక్స్ చేసారు. ఇది చాలదు అన్నట్లుగా దసరా రేస్ కు రాబోతున్న ‘గాడ్ ఫాదర్’ ‘ఘోస్ట్’ మూవీలు కూడ ఇంగ్లీష్ టైటిల్స్ తో వస్తున్నవే.
ఈసినిమాలు కాకుండా నిఖిల్ ‘స్పై’ అడవి శేషు ‘హిట్’ మూవీలు కూడ ఈ అర్థ సంవత్సరంలోనే విడుదల కాబోతున్నాయి. దీనితో తెలుగు సినిమాలకు ఈ ఇంగ్లీష్ టైటిల్స్ మ్యానియా ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పటికే సినిమాలలోని సంభాషణలలో ఇంగ్లీష్ పదాలు ఎక్కువైపోతున్న పరిస్థితులలో ఇక సినిమా టైటిల్స్ కూడ ఇంగ్లీష్ లోనే ఉంటే సగటు ప్రేక్షకుడు పూర్తిగా తెలుగును మరిచిపోయే ఆస్కారం ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
వాస్తవానికి సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టినంత మాత్రామన హిట్ అవుతాయి అన్న నమ్మకం లేదు. అలా అయితే ‘వారియర్’ మూవీకి ఫెయిల్యూర్ టాక్ వచ్చి ఉండేది కాదు. ‘అఖండ’ ‘పుష్ప’ లాంటి సినిమాలు స్వచ్చమైన తెలుగు సినిమాల టైటిల్స్ పెట్టి బ్లాక్ బష్టర్ హిట్ కొట్టారు. ఈ విషయాలను మర్చిపోయి కేవలం ఇంగ్లీష్ టైటిల్స్ పెడితే చాలు జనం ధియేటర్లకు వచ్చేస్తారు అనుకోవడం అవివేకం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..