థాంక్యూ సినిమా ఎలా ఉందంటే..?
ఇక ఈ సినిమా స్టోరీ కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యక్తి విలినియర్గా ఎలా మారారు.. అతను ఆ స్థానానికి చేరుకోవడానికి ఎవరు సహాయం చేశారు ఆయన విజయం వెనకాల ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఇక వారందరికీ తన కృతజ్ఞత భావాన్ని ఎలా చూపిస్తారో అనేది ఈ సినిమా కథ .. ఈ సినిమాలో నాగచైతన్య, మాళవిక నాయార్, అవికా గోర్, రాశీ ఖన్నా తదితరులు నటించారు. ఈ సినిమా ను డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు ఇక ఈ సినిమా చూసిన ఆడియన్స్ పలు రకాలుగా స్పందించడం జరుగుతుంది.
ఈ సినిమాలో నాగచైతన్య ఎంతో అద్భుతంగా నటించారని కొందరు అంటుంటే మరి కొంతమంది మాత్రం ఈ సినిమాలో కొన్ని మైనస్ లు ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇక థాంక్యూ సినిమాకు తమన్ బిజిఎమ్, బీసీ శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ రెండు సినిమాకు బాగా కలిసి వచ్చాయని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. బస్టాప్ బాగున్నప్పటికీ సెకండాఫ్ లో కాస్త బోరింగ్ గా అనిపించిందని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది పాజిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలకు నాగచైతన్య అద్భుతంగా నటించాలని తెలిపారు. ఎట్టకేలకు చూసుకుంటే నాగచైతన్య ఈ సినిమాలో తన లుక్ ని మార్చి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు..