నేరుగా 'ఓటిటి' లో విడుదల కానున్న తమన్నా సినిమా... ఎప్పుడు... ఎక్కడంటే..!

Pulgam Srinivas
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తమన్నా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాల పాత్రల్లో నటించి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక హోదాను సంపాదించుకుంది.
 


ఇది ఇలా ఉంటే తమన్నా ఇటు కమర్షియల్ సినిమాలలో అంద చందాలను ఆరబోస్తూనే , తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన సినిమాలలో కూడా నటిస్తూ నటిగా కూడా తనను తాను ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకుంది . ఇలా నటి గా తనను తాను ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకున్న తమన్నా  ప్రస్తుతం కూడా ఒక వైవిధ్యమైన సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. తమన్నా ప్రస్తుతం బాబ్లీ బౌన్సర్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తమన్నా  బౌన్సర్ గా కనిపించబోతుంది. ఈ మూవీ కి పలు జాతీయ అవార్డ్ లను సొంతం చేసుకున్న మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించాడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ , జంగిల్ పిక్చర్స్ కలిపి సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించాయి.
 


ఈ మూవీ ఉత్తర భారతదేశంలోని బౌన్సర్ సిటీ అసోలా  ఫతేపూర్ కి చెందిన ఓ మహిళా బౌన్సర్ కథ.  ఈ సినిమాలో తమన్నా టైటిల్ రోల్ ను పోషించింది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్ డేట్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో  సెప్టెంబర్ 23 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు కూడా  మూవీ యూనిట్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: