ఈ సినిమాకు
తమన్ సంగీతాన్ని అందించగా , దిల్ రాజు ఈ
మూవీ ని నిర్మించాడు. ఈ
సినిమా రేపు అనగా జూలై 22 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ
సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం లోని సభ్యులు వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా థాంక్యూ
మూవీ లో
హీరో గా నటించిన
నాగ చైతన్య కూడా వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న
నాగ చైతన్య అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా
నాగ చైతన్య మాట్లాడుతూ...
జోష్ మూవీ తో దిల్ రాజు గారు నన్ను
సినిమా ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేశారు.
జోష్
మూవీ తర్వాత కూడా ఆయన నా దగ్గరకు చాలా కథలను పంపించాడు. మంచి కథ కుదిరితే అప్పుడే చేయాలి అని అనుకున్నాను. అలా చూస్తూ 12 సంవత్సరాలు గడిచిపోయింది.
విక్రమ్ కె
కుమార్ గారు బీవీఎస్
రవి గారిని తీసుకొచ్చి స్టోరీ ని వినిపించినప్పుడు వెంటనే ఒకే అన్నాను.
ప్రేమమ్ సినిమాకు ఈ సినిమాకు అస్సలు సంబంధం లేదు. ఈ
సినిమా కథ అనుభవం , అనుభూతి చుట్టూ తిరుగుతోంది అంటూ
నాగ చైతన్య తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.