మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ మూవీ షూటింగ్ పనులను ముగించుకున్న రవితేజ ప్రస్తుతం ధమాకా , రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు మూవీ లలో సోలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లతో పాటు రవితేజ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఒక మూవీ లో కూడా గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే రవితేజ తాజాగా నటించిన మూవీ లలో రామారావు ఆన్ డ్యూటీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని జూలై 29 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ లలో ఫుల్ బిజీగా ఉన్న రామారావు ఆన్ డ్యూటీ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది.
రామారావు ఆన్ డ్యూటీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూలై 24 వ తేదీన సాయంత్రం 6 గంటలకు జే ఆర్ సి కన్వెన్షన్ , ఫిల్మ్ నగర్ , హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి శరత్ మండవ దర్శకత్వం వహించగా , రాజిష విజయన్ , దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే జూలై 29 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.