పాపం ఈ హీరోయిన్ కి సినిమా కష్టాలు..!!

Divya
నన్ను దోచుకుందువటే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ నభా నటేష్. హీరోయిన్గా మొదటి చిత్రంతోనే మంచి మార్కులు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబు జోడిగా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. దీంతో స్టార్ హీరోల చూపు పడేలా చేసింది ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. అనూహ్యంగా నభా నటేష్ యొక్క ప్రతిభ గుర్తించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏకంగా ఈ స్మార్ట్ శంకర్ సినిమాలో అవకాశం ఇచ్చారు ఆ సినిమా మంచి హిట్ అవడంతో ఈమె ఇస్మార్ట్ పోరిగా పేరుపొందింది.

హీరోయిన్ గా ఆ సినిమాతో కమర్షియల్ హీరోయిన్ గా నిలతక్కుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు కానీ ఈమె కెరీర్ కు కరోనా ఒక్కసారిగా అడ్డుకట్టు వేసిందని చెప్పవచ్చు. వరుస ఆఫర్లు వస్తాయనుకున్న సమయంలో అన్యంగా కరోనా రావడం వల్ల మొత్తం సీన్ అంత రివర్స్ అయ్యింది. కాస్త గ్యాప్ రావడంతో ఈ ఆమ్మడిని జనాలు మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలోని వర్గాలు కూడా పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తోంది అందుచేతనే ఈ మధ్యకాలంలో ఈమెకు ఒకటి రెండు చిన్న సినిమాలలో ఆఫర్లు కూడా దక్కించుకోలేకపోతోంది.

ఇక అల్లుడు అదుర్స్ మరియు మాస్ట్రో సినిమాలో నటించిన ఈ చిత్రాలు కమర్షియల్ గా బ్రేక్ ఇవ్వలేకపోయాయి. అంతకుముందు నటించిన సినిమాలేవి కూడా ఇమేను జనాలకు దగ్గర అయ్యేలా చేయలేకపోయాయి. దీంతో ఈమె కెరియర్ మెల్లమెల్లగా కష్టాలలో పడిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక దీంతో నభా నటేష్ మళ్లీ కెరియర్ పుంజుకోవాలి అంటే ఒకటి రెండు సినిమా అవకాశాలు రావాలని..ఆ తర్వాత కచ్చితంగా నటిగానే కాకుండా అందగత్తగా కూడా తను నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. సినిమాలలో ఆఫర్ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్గానే ఉంటోంది. సోషల్ మీడియాలో పోస్టులు ఫిలిం మేకర్స్ ను ఆకర్షించే విధంగా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: