టీజర్: హీరో రాజేంద్రప్రసాద్ అనుకోని ప్రయాణం చిత్రం ..!!

Divya
హీరోగా కమెడియన్ గా ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వస్తున్నాడు నటకిరీటి రాజేంద్రప్రసాద్. తాజాగా తను నటిస్తున్న చిత్రం "అనుకోని ప్రయాణం". ఈ సినిమా టీజర్ ను రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ తో పాటు కీలకమైన పాత్రలో ఆయన స్నేహితుడు సీనియర్ నటుడు నరసింహారాజు నటించడం జరిగింది. అనుకోకుండా మొదలుపెట్టిన ప్రయాణంలో ఎదుర్కొన్న పలు సమస్యలు ఏంటి..ఆ సమస్యలతో కొన్ని జీవితాలను ఎలా మలుపు తిప్పాయో అన్న కథాంశం తో ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది.

ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే విభిన్నమైన పాత్రలో ఆకట్టుకునే కథా అంశంతో ఈ సినిమా రూపొందించినట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమా టీజర్ ను డైరెక్టర్ రాఘవేందర్రావు విడుదల చేయడం గమనార్హం. టీజర్ కు రాఘవేంద్రరావు ప్రశంసలు దక్కాయని చిత్ర బృందం తెలియజేసింది. సినిమా విడుదల ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీగా ఇవ్వలేదు త్వరలోనే ఈ విషయాన్ని కూడా తెలియజేస్తా మనీ రాజేంద్రప్రసాద్ చెప్పే చిన్న డైలాగు ద్వారా మనకి అర్థమవుతుంది.



టీజర్ లోని డైలాగులు నా అనుకునే వారిని దేవుడు ఎప్పుడు కూడా నిర్ణయిస్తూ ఉంటాడు కానీ ఫ్రెండ్స్ ను మాత్రం మనమే సెలెక్ట్ చేసుకోవాలి అని డైలాగ్ తో ఈ సినిమా టీజర్ ప్రారంభమవుతుంది. ఇక ఈ చిత్రం కూడా ఒక ఎమోషనల్ తో కూడిన కథ అంశంతో తెరకెక్కించడం జరుగుతుంది. రాజేంద్రప్రసాద్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఉంటుంది మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే ఇప్పటికి రాజేంద్రప్రసాద్ హీరోగా పలు చిత్రాలలో నటిస్తూనే భాగం ఎక్కిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: