బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో ఒకరైన రన్బీర్ కపూర్ గురించి కొత్తగా
సినిమా ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే రన్బీర్ కపూర్ ఎన్నో విజయవంతమైన
మూవీ లలో నటించి
బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు . ఇది ఇలా ఉంటే ఈ
హీరో తాను నటించిన
హిందీ సినిమాల ద్వారా తెలుగు లోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు .
తాజాగా రన్బీర్ కపూర్ 'షంషేర్' అనే
మూవీ లో
హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ
మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయబోతున్నారు . ఇప్పటికే షంషేర్
మూవీ తెలుగు ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేయగా , ఈ
మూవీ తెలుగు ట్రైలర్ కు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది . షంషేర్
మూవీ ని జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నారు . ఇది ఇలా ఉంటే తాజాగా రన్బీర్ కపూర్ ,
ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్ లను చేశాడు . అసలు విషయం లోకి వెళితే ... రన్బీర్ కపూర్ తాజాగా తెలుగు మీడియా తో ఇంటరాక్షన్ అయ్యారు .
ఇందులో భాగంగా రన్బీర్ కపూర్ కు మీకు ఇష్టమైన పాన్
ఇండియా స్టార్ ఎవరు అనే ప్రశ్న ఎదురైంది . ఈ ప్రశ్నకు రన్బీర్ కపూర్ సమాధానం ఇస్తూ...
ప్రభాస్ నాకు నచ్చిన పాన్
ఇండియా స్టార్. కేవలం ఒక్క నటన విషయంలో మాత్రమే కాదు , ఆయన వ్యక్తిత్వం పరంగా కూడా నాకు బాగా నచ్చిన వ్యక్తి. ప్రభాస్ ను పెద్ద స్క్రీన్ పై చూడటం అంటే నాకు చాలా ఇష్టం అని తాజాగా రన్బీర్ కపూర్ చెప్పుకొచ్చాడు.