మెగా 154 లో మాస్ సాంగ్స్..మెగా ఫ్యాన్స్ కు పండగే..
సినిమాలో చిరుతో పాటుగా రవితేజ కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తుందని చెప్పొచ్చు. మెగా 154 మూవీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు దేవి మ్యూజిక్ అంటే సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది.అదే రేంజ్ లో మెగా 154 మూవీకి కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదరగొట్టేస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో 4 ఊర మాస్ సాంగ్స్ ఉంటాయని తెలుస్తుంది. సినిమా మొత్తం మీద నాలుగు సాంగ్స్ ఉంటాయని తెలుస్తుండగా ఆ సాంగ్స్ అన్ని మాస్ సాంగ్స్ గా వస్తున్నాయట.
ఊర మాస్ సాంగ్స్ లో దేవి అదరగొట్టేస్తాడు. వాళ్తేర్ వీరయ్య టైటిల్ తో వస్తున్న ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి తన మాస్ స్టామినా ఏంటో చూపించనున్నారు. ఆచార్య నిరుత్సాపరచగా ఆ సినిమా ఫెయిల్యూర్ కి గల కారణాలన్ని తను తీసే మిగతా సినిమాలకు రిపీట్ అవకుండా జాగ్రత్త పడుతున్నాడు చిరంజీవి..గాడ్ ఫాదర్ కూడా క్రేజీగా రాబోతుంది. దసరా బరిలో దిగుతున్న గాడ్ ఫాదర్ మెగాస్టార్ రేంజ్ కి తగినట్టుగా ఉంటుందని అంటున్నారు. ఇక భోళా శంకర్ కూడా సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్నా తప్పకుండా మాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత వస్తున్న ఈ వాళ్తేర్ వీరయ్య మెగా మాస్ మూవీగా రికార్డులు కొల్లగొడుతుందని చిత్రయూనిట్ చెబుతున్నారు...ఈ సినిమాతో చిరు పవర్ చూపించాలని ట్రై చేస్తున్నారు..