సింబూ తో డేటింగ్ నిజం కాదంటున్న త్రిష..!!

murali krishna
సీనియర్ భామ అయిన త్రిష అంటే.. ఇప్పటికీ యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా తన అందచందాలతో త్రిష కనువిందు చేస్తూనే ఉంది.


ప్రస్తుతం మణిరత్నం పాన్ ఇండియా సినిమా 'పీఎస్ 1'లో కీలక పాత్రలో ఆమె నటిస్తోంది. అయితే తాజాగా ఈ సీనియర్ బ్యూటీ పై కోలీవుడ్ లో రోజురోజుకూ రూమర్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. త్రిష మళ్లీ ప్రేమలో పడిందట.


తమిళ హీరో శింబుతో త్రిష చాలా కాలం నుంచి డేటింగ్ లో ఉందని.. అందుకే ఈ మధ్య త్రిష తరుచూ శింబు అఫీస్ కి వెళ్తుందని.. అలాగే శింబు కూడా త్రిష ఇంటిలో పలుసార్లు కనిపించాడని ఇలా చాలా పుకార్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ పుకార్లల్లో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, త్రిష మాత్రం చాలా బోల్డ్ గా ముందుకు పోతుంది. ఎవరైనా ప్రేమ గురించి అడిగితే.. ప్రేమ లేదు, దోమ లేదు.. జస్ట్ ఫన్ అంటుందట.


మొత్తానికి శింబుగారి సేవలో త్రిష ఫుల్ బిజీగా ఉందట. ప్రస్తుతానికి తమిళ సినీ పరిశ్రమలో ఈ గుసగుసలే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజానికి ఇలాంటి పుకార్లు ఇటు త్రిష పై, అటు శింబు పై గతంలో ఎన్నోసార్లు వచ్చాయి. అయితే వీరి ప్రేమ కథలు సక్సెస్ కాలేదు. ఏది ఏమైనా త్రిష మాత్రం తన పై వస్తున్న ఈ రూమర్ల పై, ఆమె ఎలాంటి స్పందన అయితే ఇవ్వడం లేదు.



త్రిష క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ పుకార్లు అంతా నిజమే అనుకుంటున్నారు. ఎలాగూ వయసు కూడా 38 దాటేస్తుంది. నిజానికి ఐదేళ్ల క్రితమే త్రిష పెళ్లి ఆలోచన చేసింది. కానీ కాలం కలిసి రాక, పెళ్లి అయితే కాలేదు. కరెక్ట్ ఏజ్ లో పెళ్లి అయి ఉంటే.. త్రిష కూతురు కూడా ఈ పాటికి చైల్డ్ ఆర్టిస్ట్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి ఉండేది. కానీ ఏమి చేస్తాం, ఇంకా త్రిషకే పెళ్లి కాకపాయే.


ఏది ఏమైనా ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‌ గా ఒక వెలుగు వెలిగిన త్రిష అంటే.. ఇప్పటికీ అభిమానుల్లో ఫుల్ క్రేజ్ అయితే ఉంది. ఇక తన లైఫ్ స్టైల్ పై, తన వ్యవహారాల తంతంగం పై గాసిప్ రాయుళ్లు కూడా ఎంత తాపత్రయ పడినా త్రిష మాత్రం ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: