మాస్ మహారాజా
రవితేజ కు
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న
రవితేజ ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకొని అనేక విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న
హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు .
ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం
క్రాక్ మూవీ తో సూపర్
సక్సెస్ ను అందుకున్న
రవితేజ ఆ తర్వాత ఖిలాడి
మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర పరాజయాన్ని అందుకున్నాడు . మంచి అంచనాలతో విడుదలయిన ఈ
సినిమా బాక్సా ఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం
రవితేజ వరుస
మూవీ లలో నటిస్తున్నాడు . అందులో భాగంగా
రవితేజ తాజాగా నటించిన రామారావు
సినిమా జూలై 29 వ తేదీన గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది . ఈ
మూవీ కి
శరత్ మండవ దర్శకత్వం వహిస్తుండగా , ఈ
మూవీ లో
రవితేజ సరసన రాజిష విజయన్ , దివ్యాంకా
కౌశిక్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు .
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ఆంధ్ర ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది . ఈ
సినిమా ఆంధ్ర ఏరియాకు గాను 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుతున్నట్లు సమాచారం. ఇలా రామారావు ఆన్ డ్యూటీ
మూవీ ఆంధ్ర ఏరియాలో అదిరిపోయే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే రామారావు ఆన్ డ్యూటీ
మూవీ తో
రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.