రెబల్ స్టార్
ప్రభాస్ 'బాహుబలి' లాంటి భారీ విజయం తర్వాత
సాహో , రాధే
శ్యామ్ అనే భారీ పాన్
ఇండియా మూవీ లలో నటించినప్పటికీ ఈ రెండు సినిమాలు కూడా ప్రభాస్ కు బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చాయి . ఇది ఇలా ఉంటే
ప్రభాస్ ప్రస్తుతం
ఆది పురుష్ , సలార్ , ప్రాజెక్ట్ కే అనే
మూవీ లలో నటిస్తున్నాడు .
ఇందులో ఇప్పటికే
ఆది పురుష్
సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది .
ఆది పురుష్ సినిమాకు
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
ప్రభాస్ ,
ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సలార్,
నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే
సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సలార్
సినిమా అదిరిపోయే యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో
శృతి హాసన్,
ప్రభాస్ సరసన కథానాయికగా నటిస్తుండగా , పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ
మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు
రవి బుస్రుర్ సంగీతాన్ని అందిస్తున్నాడు . అలాగే
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకొనే
హీరోయిన్ గా నటిస్తుండగా , బిగ్ బి
అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న
ప్రభాస్ ,
మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం
ప్రభాస్ ,
మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే
సినిమా సలార్ , ప్రాజెక్ట్ కే సినిమాల షూటింగ్ ముగిసిన తర్వాతనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.