సొట్ట బుగ్గల సుందరి మరి ఇంత హాట్ గానా..!

Pulgam Srinivas
సొట్టబుగ్గల సుందరి తాప్సీ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఝుమ్మంది నాదం అనే తెలుగు సినిమాతో సినిమా కెరియర్ ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాలోనే తన హాట్ హాట్ అందాలను ఆరబోసి ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకుంది.
 


అలాగే ఝుమ్మంది నాదం సినిమాలో నటనతో కూడా తాప్సీ ప్రేక్షకులను అలరించింది. ఇలా మొదటి సినిమాలోనే అందచందాలతో, నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్ లు దక్కాయి.  అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటించిన తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో తాప్సి నటించిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలను అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది.
 


ఇది ఇలా ఉంటే తాప్సి కూడా బాలీవుడ్ లో కమర్షియల్ సినిమాల్లో నటించడానికి ప్రాముఖ్యతను ఇవ్వకుండా, కథకు ప్రాధాన్యత ఉన్న లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తన కెరీర్ ని కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే తాప్సి తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ అనే మూవీ లో నటించింది. తెలుగు సినిమాల ద్వారా మంచి గుర్తింపును దక్కించుకొని, ప్రస్తుతం హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న తాప్సి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన అందచందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా తాప్సీ తన ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా తాప్సీ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో ప్యాంట్ మరియు కోట్ ను వేసుకుంది. కానీ తాప్సి వేసుకున్న కోట్ బటన్లు అన్నీ విప్పేసి,  తన లో దుస్తులు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం తాప్సీ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: