నాగార్జున చిరంజీవిల మధ్య చిచ్చు పెడుతున్న దసరా ?
సమ్మర్ రేస్ తరువాత తిరిగి రాబోతున్న దసరా రేస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. రాబోతున్న దసరా వార్ సంక్రాంతి సినిమాల వార్ ను మించిన స్థాయిలో జరగబోతోంది. ఇప్పటికే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ దసరా రేస్ కు తన ప్లేస్ ను ఫిక్స్ చేసుకుంది. నాగార్జున కూడ తన ‘ఘోస్ట్’ మూవీని విజయదసమి రోజున చేయబోతున్నారు.
నాని ‘దసరా’ మూవీ కూడ ఇదే దసరా కు రాబోతోంది. ఇవి చాలవు అన్నట్లుగా మణిరత్నం భారీ బడ్జెట్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 1 కూడ దసరా రేసుకు రాబోతోంది. ఈసినిమాల బిజినెస్ అంతా కలుపుకుంటే సుమారు 400 కోట్లకు పైగా ఉంటుంది అన్న అంచనాలు వస్తున్నాయి. దీనితో ఇంత బిజినెస్ దసరా సీజన్ లో జరిగినప్పటికీ ఆస్థాయిలో వందల కోట్లు కలక్షన్స్ వచ్చేలా దసరా సినిమా రేస్ ఉంటుందా అన్న సందేహాలు వస్తున్నాయి.
వాస్తవానికి రాబోతున్న దసరా రేస్ లో చిరంజీవి బాలకృష్ణల సినిమాల వార్ ఉంటుంది అని అనుకున్నారు అంతా. అయితే బాలకృష్ణ కు కరోనా రావడంతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ దసరా రేస్ నుండి తప్పుకోవలసి వచ్చింది. ఇప్పుడు అనుకోకుండా బాలయ్య తప్పుకోవడంతో వ్యూహాత్మకంగా నాగార్జున వచ్చి చేరడంతో ప్రియమిత్రుల మధ్య పోటీగా దసరా రేస్ మారనున్నది. మరి ఈ రేస్ లో ఎవరు నిలబడగలుగుతారో చూడాలి..