బుల్లెట్ సాంగ్ పై ఆధారపడిన రామ్ భవిష్యత్ !
అయితే ఈమధ్య కాలంలో సగటు ప్రేక్షకులకు హీరోలు పోలీసు పాత్రలో నటిస్తూ చేసే విన్యాసాల పై కొద్దిగా మోజు తగ్గ్గింది. ఇప్పుడు ప్రేక్షకులు కథలో వెరైటీని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో రామ్ నటిస్తున్న ఈ రొటీన్ సినిమా కథ ఎంతవరకు సగటు ప్రేక్షకులకు నచ్చుతుంది అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
దీనికితోడు దర్శకుడు లింగు స్వామి సినిమాలలో సహజత్వం కంటే మాస్ మసాలా అంశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మాస్ మసాలా సినిమాలను ఆదరించే విషయంలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. అయినప్పటికీ ఈసినిమా తనకు బ్లాక్ బష్టర్ హిట్ ఇస్తుందని రామ్ నమ్మకం పెట్టుకున్నాడు. కమలహాసన్ ‘విక్రమ్’ మూవీ తరువాత దక్షిణాది సినిమా రంగంలో సరైన హిట్స్ లేకపోవడంతో దాదాపు నెలరోజులుగా తెలుగు రాష్ట్రాలలోని చాల సినిమా ధియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితులలో మాస్ సినిమా కోసం వేలం వెర్రిగా ఎదురు చూస్తున్న మాస్ ప్రేక్షకులకు ఈమూవీ నచ్చుతుందని కొందరి అభిప్రాయం. దీనికి తగ్గట్టుగానే ఈమూవీలోని ‘బులెట్’ సాంగ్ యూత్ కు బాగా కనెక్ట్ అవ్వడంతో ఆపాట యూట్యూబ్ లో బాగా ట్రెండింగ్ గా మారింది. దీనికితోడు ఈ పాటకు వేల సంఖ్యలో లైక్స్ రావడంతో పాటు కృతి శెట్టి గ్లామర్ కూడ ఈమూవీని హిట్ అడుగులు వేయిస్తుందనే అంచనాలు ఉన్నాయి..