'ది వారియర్' ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
రామ్ పోతినేని హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ మూవీ తెరకెక్కిన విషయం  మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషలలో తెరకెక్కింది.


ఈ మూవీ ని జూలై 14 వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు మరియు తమిళ ట్రైలర్ లను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. రెండు భాషల  ట్రైలర్ లకు మంచి ఆదరణ లభించడం మాత్రమే కాకుండా ఈ ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై కూడా రెండు రాష్ట్రాల ప్రజలు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా చిత్ర బృందం ఇప్పటికే తమిళ్ మరియు తెలుగు రాష్ట్రాలలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లను కూడా ముగించి ప్రస్తుతం ప్రమోషన్ లలో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది.


ఇది ఇలా ఉంటే ది వారియర్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు గురించి తెలుసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ది వారియర్ మూవీ 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2 కోట్లు , ఓవర్ సీస్ లో 2.10 కోట్లు , తమిళ్ వర్షన్ కు 4 కోట్లు , మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: