మాస్ మహారాజా
రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ అనే
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ
మూవీ కి
శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
మూవీ తో
శరత్ మండవ దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించబోతున్నాడు.
ఎస్ఎల్వి సినిమాస్, ఆర్టి టీమ్ వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి ఈ
మూవీ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో
రవితేజ సరసన రాజిష విజయన్ , దివ్యాంకా
కౌశిక్ హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా , సమ్ సి ఎస్ ఈ
మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ
మూవీ ని జూలై 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేది దగ్గర పడడంతో రామారావు ఆన్ డ్యూటీ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ
సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ఈ
సినిమా ట్రైలర్ విడుదల తేదిని అధికారికంగా ప్రకటించింది. రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ ను జూలై 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఒక
పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.