టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే . ఈ మూవీ లో రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు .
ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు . కొంత కాలం క్రితం ఈ మూవీ ని జూలై 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆ తరువాత ఈ మూవీ ని జూలై 15 వ తేదీన కాకుండా జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ సినిమా టీజర్ ను కూడా కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం విడుదల చేయగా , ఈ మూవీ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ కూడా చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ మూవీ ట్రైలర్ ను ఈ రోజు అనగా జూలై 12 వ తేదీన హోటల్ అవస , హైటెక్ సిటీ హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలన్నింటికీ కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.