నాచురల్ స్టార్ నాని వరుసగా వి మరియు టక్ జగదీష్ మూవీలను థియేటర్ లలో కాకుండా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో విడుదల చేసి తన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన ఈ హీరో శ్యామ్ సింగరాయ్ మూవీ ని థియేటర్ లలో విడుదల చేసి తన అభిమానులను ఆనంద పరచడం మాత్రమే కాకుండా తాను కూడా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు.
ఇలా శ్యామ్ సింగరాయ్ మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న నాని కొన్ని రోజుల క్రితమే అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మాన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నజ్రియా హీరోయిన్ గా నటించగా , వివేక్ ఆత్రేయ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన అంటే సుందరానికి మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని 'దసరా' సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన మహానటి కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా , ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నాని అదిరిపోయే మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ప్రచార చిత్రాల్లో నాని మాస్ లుక్ లో అదరగొట్టాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... దసరా మూవీ ని ఏకంగా 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త తెలిసిన కొంత మంది 40 కోట్ల బడ్జెట్ అంటే చాలా పెద్ద విషయం అని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.