ప్రభాస్ "స్పిరిట్"... సందీప్ రెడ్డి న్యూ ప్లాన్ ?

VAMSI
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ గా పేరున్న హీరో డార్లింగ్ ప్రభాస్ బాహుబలి మరియు బాహుబలి 2 సినిమాల తరువాత తన స్థాయిని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ రెండు సినిమా ద్వారా తన ఫ్యాన్స్ ఎంత హ్యాపీ అన్నది మనము ఊహించలేము. అయితే ఈ సినిమా తరువాత తాను చేసే ప్రతి సినిమాపై కూడా ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఆలా వచ్చిన రెండు భారీ బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. ఈ విషయంలో ఫ్యాన్స్ చాలా నిరాశ పడ్డారు. సాహూ మరియు రాధే శ్యామ్ లు ఎంత దారుణమైన ఫలితాన్ని ఇచ్చాయి అన్నది తెలిసిందే. అందుకే తన తర్వాత సినిమాలపై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు ప్రభాస్.

ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె మరియు స్పిరిట్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఇందులో స్పిరిట్ ను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించనున్నాడు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా కాస్టింగ్ పనులలో ఈ కుర్ర డైరెక్టర్ బిజీగా ఉన్నాడు. అయితే అర్జున్ రెడ్డి మూవీ డిఫరెంట్ మరియు ఇప్పుడు ప్రభాస్ తో తీయబోయే సినిమా చాలా డిఫెరెంట్ అని తెలిసిందే. కాగా ప్రభాస్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు సందీప్ రెడ్డి. బాహుబలి తరువాత ప్రభాస్ తీసిన సినిమాలలో జరిగిన తప్పులను ఇందులో జరగకుండా ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి సందీప్ ఈ సినిమా కోసం కొత్త రకమైన ఫార్ములాను వాడనున్నాడని తెలుస్తోంది.  

అయితే ఈ సినిమాకన్నా ముందు ఆదిపురుష్, సలార్ మరియు ప్రాజెక్ట్ కె లు రిలీజ్ ఐయిపోతాయి. కాబట్టి వాటి ఫలితాలు ఎలా ఉన్నా ఏ మాత్రం తగ్గకుండా తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.      


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: