కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతి హాసన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన శృతి హాసన్ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే.
తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ 'క్రాక్' సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వఖిల్ సబ్ మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ప్రస్తుతం శృతి హాసన్ , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్ షూటింగ్ లో భాగంగా శృతి హాసన్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయినట్టు సమాచారం. ప్రస్తుత షెడ్యూల్ లో శృతి హాసన్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బంధం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.