జూనియర్ కండిషన్స్ కు ఇరుకున పడుతున్న కొరటాల ?

Seetha Sailaja
పరాజయం అన్నపదం ఎరుగని కొరటాల శివకు ‘ఆచార్య’ అనేక గుణపాఠాలు నేర్పింది. ఈమూవీతో తనకు ఆర్థికంగా ఎన్నో లాభాలతో పాటు తన ఇమేజ్ కూడ బాగా పెరుగుతుందని కొరటాల శివ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈమూవీ ఊహించని ఘోర పరాజయం చెందడంతో ఈమూవీ బయ్యర్లకు వచ్చిన నష్టాలను తీర్చవలసిన బాధ్యత కొరటాల పై పడింది అని అంటారు.


ఈమూవీకి కొరటాల శివ సహ నిర్మాతగా వ్యవహరించడంతో ఈమూవీ నష్టాల బాధ్యత నుండి కొరటాల తప్పించుకోలేకపోయాడు అన్న ప్రచారం ఉంది. ఈమూవీని అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ మొత్తానికి కొనడంతో అమెజాన్ సంస్థ నుండి వచ్చే డబ్బుతో ఈమూవీ బయ్యర్ల కష్టాలను తీర్చవచ్చని మొదట్లో కొరటాల భావించాడట. అయితే అమెజాన్ లో ఈమూవీని చూడటానికి పెద్దగా ఎవరు ఆశక్తి కనబరచక పోవడంతో ఈమూవీ నిర్మాతలకు ఇవ్వవలసిన మొత్తంలో కొంత తొక్కిపెట్టింది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఈ పరిస్థితుల మధ్య అమెజాన్ సంస్థ నుండి వచ్చిన డబ్బు నిర్మాతల కష్టాలను తీర్చడానికి సరిపోవకపోవడంతో స్వయంగా కొరటాల రంగంలోకి దిగి ఈమూవీ బయ్యర్లకు తాను ఇచ్చిన మాట ప్రకారం వారి నష్టాలను తీర్చే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నట్లు టాక్. ఈ వ్యవహారంలో కొరటాల తన పేరున ఉన్న ఒక విలువైన ఆస్థిని కూడ అమ్మకం పెట్టి మార్కెట్ లో తన పరపతిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ గాసిప్పుల హడావిడి జరుగుతోంది.


ఇలా కొరటాల వ్యవహరించడానికి మరొక కారణం కూడ ఉంది అని అంటున్నారు. కొరటాల జూనియర్ తో మొదలపెట్టవలసి ఉన్న మూవీ షూటింగ్ ప్రారంభానికి ‘ఆచార్య’ నష్టాలకు లింక్ ఉంది అని అంటున్నారు. ‘ఆచార్య నష్టాలకు సంబంధించి బయ్యర్లకు కొరటాల హామీపడిన మొత్తం సెటిల్  అయితే కానీ తారక్ తో కొరటాల తీయబోయే మూవీ విషయంలో పూర్తిగా కొరటాల శివ శ్రద్ధపట్టలేడని తారక్ కోరతాలకు ఇలాంటి కండిషన్ పెట్టి ఉంటాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఎలా ఉన్నా అసలు నిజాలు వారికే తెలియాలి..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: