టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు అయిన
సుశాంత్ తాజాగా మా నీళ్ళ ట్యాంక్ అనే వెబ్ సిరీస్ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే.
లీడర్ మూవీ తో తెలుగు పరిశ్రమకు పరిచయం అయిన
ప్రియా ఆనంద్ వెబ్ సిరీస్ లో
సుశాంత్ సరసన
హీరోయిన్ గా నటిస్తోంది.
మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్ కు వరుడు కావలెను సినిమాకు దర్శకత్వం వహించిన
లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తోంది. ఈ వెబ్ సిరీస్ తో
సుశాంత్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ తో
ప్రియా ఆనంద్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఒక చిన్న గ్రామంలో పనికి రాని వాటర్ ట్యాంక్ చుట్టూ ఈ వెబ్ సిరీస్ కథ నడవనుంది. ఈ వెబ్ సిరీస్ ను జీ 5 సంస్థ నిర్మించండి. ఈ వెబ్ సిరీస్ లో
సుశాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ వెబ్ సిరీస్ ని జీ 5 'ఓ టి టి' లో జూలై 15 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేది దగ్గర పడటంతో ఈ మేకర్స్ ప్రమోషనల్ స్పీడ్ ను వేగవంతం చేసింది.
అందులో భాగంగా తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. మా నీళ్ళ ట్యాంక్ వెబ్ సిరీస్ ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ ను
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్
హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న
పూజా హెగ్డే చేతులమీదుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది చూడాలి.