కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని బింబిసార అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తుండగా ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించాడు.
ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటం తో తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండటం తో పాటు కళ్యాణ్ రామ్ పర్ఫామెన్స్ కూడా ఈ ట్రైలర్ లో హైలెట్ గా నిలవడంతో బింబిసార సినిమా ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ యూ ట్యూబ్ లో మిలియన్ ల కొద్ది వేసిన సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడం, అలాగే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
అలా తిని ప్రేమికుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న బింబిసార సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బింబిసార మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకు ఉంటాడో చూడాలి. ఈ మూవీ ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ. కే నిర్మించారు.