సూపర్ స్టార్ మహేష్ బాబు
త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరి కొన్ని రోజులు ఒక
సినిమా ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు ,
ఖలేజా మూవీ లు తెరకెక్కాయి . ఈ రెండు
మూవీ లు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి .
దానితో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూడవ
మూవీ పై మహేష్ బాబు అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు . అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత
సినిమా వస్తుండడంతో కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి . ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో
సినిమా తెరకెక్కబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఈ
సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. దానికి ప్రధాన కారణం
మూవీ ని అనౌన్స్ చేసినప్పటికీ
మూవీ స్క్రిప్ట్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉండడంతో
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇన్ని రోజుల పాటు స్క్రిప్ట్ పైనే వర్క్ చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫైనల్ కథను రెడీ చేసి మహేష్ బాబు కు వినిపించినట్లు తెలుస్తోంది. ఆ ఫైనల్ కథను విన్న మహేష్ బాబు సూపర్ సాటిస్ఫై అయినట్లు మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాట్లు తెలుస్తోంది. ఇలా
త్రివిక్రమ్ శ్రీనివాస్ , మహేష్ బాబు
సినిమా కథకు సంబంధించిన పనులు అన్నింటినీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా,
తమన్ ఈ
మూవీ కి సంగీతం అందించనున్నాడు.