టాలీవుడ్
ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న
హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న
లావణ్య త్రిపాటి తాజాగా హ్యాపీ బర్త్ డే అనే
మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ ని మొదట జూలై 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఆ తర్వాత
మూవీ ని జూలై 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. ఇలా ఈ
సినిమా విడుదల తేదీ కాస్త ముందుకు రావడంతో చిత్ర బంధం ప్రమోషన్ ల స్పీడ్ ను వేగ వంతం చేసింది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ
సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. హ్యాపీ బర్త్ డే
మూవీ ట్రైలర్ చాలా డిఫరెంట్ గా ఉండడం మాత్రమే కాకుండా , ఈ ట్రైలర్ ను చూస్తుంటే ఈ సినిమాను చాలా కొత్త రకం కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. అలాగే ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటం , ఈ ట్రైలర్ లో కూడా అనేక
కామెడీ సన్నివేశాలు ఉండటంతో హ్యాపీ బర్త్ డే
మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే ఆదరణ లభిస్తోంది.
అందులో భాగంగా ఇప్పటి వరకు హ్యాపీ బర్త్ డే
మూవీ ట్రైలర్ కు 3.5 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇలా ప్రస్తుతం హ్యాపీ బర్త్ డే
మూవీ ట్రైలర్ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి రితీశ్
రానా దర్శకత్వం వహించగా ,
నరేష్ అగస్త్య, సత్య,
వెన్నెల కిషోర్, గుండు
సుదర్శన్ ఈ
మూవీ లో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ
మూవీ కి
కాలభైరవ సంగీతాన్ని అందించాడు.