ఊపిరి తిత్తుల సమస్య తో గత కొన్ని నెలలుగా భాధ పడుతూ నటి
మీనా భర్త చనిపోయిన విషయం అందరికి తెలిసిందే.. ఆమె
భర్త విద్యాసాగర్ గతకొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ,
చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రి లో బుధవారం తుదిశ్వాస విడిచారు.. ఆయన మృతితో నటి
మీనా షాక్ లోకి వెళ్లిపోయింది. తన
భర్త ను కాపాడుకునేందుకు
మీనా చాలా కష్టపడింది. కానీ ఆమె ప్రయత్నాల కు ఫలితం లేకుండా పోయింది..
తన
భర్త లేని లోటు మమ్మల్ని భాధిస్తుందని
మీనా తాజాగా వెల్లడించారు.
భర్త మరణాంతరం
మీనా తొలిసారి సోషల్
మీడియా వేదికగా స్పందించింది. తన
భర్త విద్యాసాగర్ మృతికి సంబంధించి పలు అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని.. దయచేసి ఇలాంటి వాటిని ప్రచారం చేయవద్దంటూ ఆమె మీడియాను భాగోద్వేగ మనసు తో కోరుకుంది.
భర్త దూరమయ్యారనే బాధలో ఉన్నాను. ఈ సమయం లో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి. అంటూ
మీనా తన
ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి వేడుకుంది.
కష్టకాలం లో తమకు అండగా నిలిచి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ
మీనా ధన్యవాదాలు తెలియ జేసింది. తన
భర్త ప్రాణాల ను కాపాడేందుకు ఎంతో కృషి చేసిన వైద్య బృందం, తమిళనాడు సీఎం, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్ రాధాకృష్ణన్, సన్నిహితులు, మిత్రులకు ఆమె ఈ సందర్భం గా కృతజ్ఞతలు తెలిపింది. తన
భర్త కోలుకోవాలని తన తో పాటు కోరుకున్న తన అభిమానులకు రుణపడి ఉంటానని ఆమె ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్
మీడియా లో
మీనా ఫ్యాన్స్‌ను కంటతడి పెట్టిస్తుంది..ఇక
మీనా సినిమా లు చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది..ఇప్పుడు
మీనా పరిస్థితిని చూసిన అందరు కంటతడి పెడుతున్నారు..