తెలిసి తెలిసి ప్లాప్ సినిమాలు చేసిన స్టార్స్ వీరే?
ఇంకొన్ని చిత్రాల్లో కంటెంట్ బలంగా ఉన్న టేకింగ్ లో టాలెంట్ కనపడకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాలన్ని ఎదుర్కొంటున్నాయి. ఇదే తరహాలో గత ఆరు నెలల్లో భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి గతి తప్పి బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచిన చిత్రాలేవో ఇపుడు చూద్దాం పదండి.
చిరంజీవి & రామ్‌చరణ్: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి ఇండస్ట్రీలో అన్ని ఎత్తు పల్లాలను చూసేసారు. ప్రేక్షకుల నాడి తెలిసిన ఈ హీరో కూడా ఆచార్య చిత్రం తో డిజాస్టర్ ను అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి మరియు తనయుడు రామ్‌చరణ్ నటించడం, కొరటాల శివ డైరెక్షన్ ఇలా స్టార్ కాంబినేషన్ కావడం తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..కానీ, ఆ అంచనాలను అందుకోలేక అడ్డంగా పాదగట్టం లో బుక్ అయిపోయింది.
ప్రభాస్: ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ విషయానికి వస్తే 'రాధేశ్యామ్' తో పెద్ద డిజాస్టర్ నే అకౌంట్ లో వేసుకున్నాడు. వింటేజ్ లవ్ స్టోరీ.. విదేశాల్లో షూటింగ్ అంతా కూడా టైటానిక్ షిప్ అంతా కనిపించాయి కానీ చివరికి ఈ సినిమాలో షిప్ లా సినిమాపై పెట్టుకున్న ఆశలన్నీ నిండా మునిగిపోయాయి. కానీ ప్రభాస్ క్రేజ్ కు మాత్రం ఎక్కడా ఏమాత్రం డామేజ్ కాలేదు. అంతా కూడా దర్శకుడి అకౌంట్ లోకి వెళ్ళిపోయింది.
కీర్తి సురేష్: 'మహానటి' సినిమాతో జాతీయ నటి స్థాయికి చేరుకున్న కీర్తి సురేష్ కూడా కథల్ని ఎంచుకోవడం లో చేసిన పోరపాట్లతో ఫెయిల్యూర్స్ చూడల్సి వచ్చింది. చిన్ని, 'గుడ్ లక్సఖి' తో ప్రేక్షకులను పలకరించినా బ్యాడ్ లక్ వెంటాడి సినిమాలు నిరాశ పరిచాయి.
వరుణ్ తేజ్ : నటుడు మెగా హీరో వరుణ్‌తేజ్ కూడా 'గని' దెబ్బలో బాక్స్ ఆఫీస్ వద్ద చతికల పడ్డారు. సినిమా పలు బిగ్ థియేటర్లలో రిలీజ్ అయినా అస్సలు పస లేదంటూ జనాలు అటు వైపు చూడనే లేదు.