సినిమా
ఇండస్ట్రీ లోకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొంత మంది దర్శకులు మాత్రం ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో అదిరిపోయే
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని మొదటి
సినిమా తోనే దర్శకుడిగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర విజయాలను అందుకోవడం లో కొంత మంది దర్శకులు చాలా స్లో అవుతూ ఉంటారు.
ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలా కెరియర్ లో దర్శకత్వం వహించిన మొదటి సినిమాతో
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత వరుస అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొంటున్నాడు. ఇది ఇలా ఉంటే సంతోష్ శ్రీనివాస్ ప్రస్తుతం ఇద్దరు మెగా హీరోలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
సంతోష్ శ్రీనివాస్ ప్రస్తుతం
సాయి ధరమ్ తేజ్ , పంజా వైష్ణవ్ తేజ్ ఇద్దరిలో ఎవరో ఒకరితో
సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. కాకపోతే ఇప్పటికే
సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ఇద్దరూ కూడా తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి
సంతోష్ శ్రీనివాస్ తో
సినిమా ఎప్పటికీ సెట్ అవుతుందో చూడాలి.