ట్రెండ్ సెట్టర్ గా మారనున్న కెడ కోల !

Seetha Sailaja
‘పెళ్ళి చూపులు’ మూవీతో తరుణ్ భాస్కర్ పేరు మారుమ్రోగిపోయింది. ఆతరువాత అతడు దర్శకత్వం వహించిన ‘ఈనగరానికి ఏమైంది’ మూవీ ఫ్లాప్ కావడంతో అతడి మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఆమధ్య ఈ యంగ్ డైరెక్టర్ వెంకటేష్ ను కలిసి హార్స్ రెడింగ్ మాఫియా నేపధ్యంలో అల్లిన కథను వెంకీ కి వినిపించినప్పటికీ అతడు ఆశక్తి కనపరచలేదు అని అంటారు.

వెంకీ స్పందించక పోవడంతో తరుణ్ భాస్కర్ అనేకమంది హీరోల చుట్టూ తిరిగినప్పటికీ వారెవ్వరూ అతడికి అవకాశాలు ఇవ్వలేదు అని అంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ యంగ్ డైరెక్టర్ ప్రారంభిస్తున్న ఒక కొత్త సినిమాకు ‘కెడ కోల’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఒక క్రైం కథకు కామెడీ టచ్ ఇస్తూ తీయబోతున్న ఈ మూవీలో నటించడానికి ఒక మీడియం రేజ్ హీరో ముందుకు వచ్చాడు అన్నప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ మూవీ త్వరలోనే షూటింగ్ పట్టాలు ఎక్కుతుంది అని అంటున్నారు. ఈ మూవీ ఇంకా ప్రారంభం కాకుండానే ‘ఓరుగల్లు’ అన్న వెబ్ సిరీస్ ను తరుణ్ భాస్కర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 1990 ప్రాంతంలో వరంగల్లు లో జరిగిన ఒక యదార్థ సంఘటనను ఆధారంగా తీసుకుని ఈ వెబ్ సిరీస్ ను డిజైన్ చేసారు అని అంటున్నారు. ఈమధ్య కాలంలో ప్రేక్షకులు సినిమాలకు సంబంధించి వెరైటీ టైటిల్స్ కు ఆకర్షితులు అవుతున్నారు.

ఆమధ్య వచ్చిన ‘డిజే టిల్లు’ టైటిల్ పరంగా కూడ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఈ ట్రెండ్ ను కనిపెట్టి తరుణ్ భాస్కర్ తాను తీయబోయే సినిమాకు ఇలాంటి వెరైటీ టైటిల్ పెట్టాడు అనుకోవాలి. యూత్ కు సినిమా టైటిల్ నచ్చితే చాలు చిన్న సినిమా అయినప్పటికీ ఆసినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. మరి తరుణ్ భాస్కర్ చేయబోతున్న ఈ ప్రయోగంతో మళ్ళీ అతడి క్రేజ్ ఎలా పెరుగుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: