అల్లరి నరేష్ హంగామా ఇప్పటి నుంచి మామూలుగా ఉండదా..?

Divya
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అల్లరి సినిమాతో మొదటిసారిగా హీరో గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ రోజున అల్లరి నరేష్ పుట్టినరోజు. ముఖ్యంగా కామెడీ సినిమాలను ప్రధాన ఆయుధంగా మలచుకొని సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉన్నారు. దాదాపుగా 20 ఏళ్లుగా తన సినీ ప్రయాణంలో రొటీన్ కామెడీ పాత్రలతో నవ్విస్తూ వచ్చారు. ఈ పాత్ర తరువాత నేను వంటి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల్లో కూడా నటించారు. ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయినా నటుడిగా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత ఎన్నో పర్యావరణకంగా చిత్రాలలో నరేష్ నటిస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల తనకి ఇష్టం ఉన్నా.. లేకున్నా కామెడీ చిత్రాలలో నటించాల్సి వచ్చింది.. గత సంవత్సరం నాంది సినిమాతో మంచి విజయాలని అందుకున్నాడు. ఈ సినిమా కంటే ముందు దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం వరకు అల్లరి నరేష్ కు మంచి సక్సెస్ ఏమో ఏది పడలేదని చెప్పవచ్చు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నరేష్ లో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించుకున్నాడు. దీంతో ఇలాంటి సినిమా పాత్రలోనే నటించడానికీ ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అల్లరి నరేష్.
ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం సభకు నమస్కారం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఇలాంటి చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.. ఈ సరికొత్త విభిన్నమైన కథలతో నరేష్ నటిస్తున్న చిత్రాలతో పాటుగా బాలకృష్ణతో కలసి ఒక మూవీని చేయబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలకృష్ణ ఒక భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు .ఈ సినిమాలో శ్రీ లీల కూతురుగా నటిస్తున్నది. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఇందులో అల్లరి నరేష్ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇక అల్లరి నరేష్ కెరియర్ మామూలుగా ఉండదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: