సుధీర్ రష్మి లవ్ పై.. హైపర్ ఆది షాకింగ్ కామెంట్?

praveen
సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మి.. ఇద్దరు పేరు వినిపించింది అంటే చాలు బుల్లితెర ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరి జోడీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంది అని చెప్పాలి. జబర్దస్త్ ద్వారా మొదలైన వీరి ప్రేమ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. వీరి ప్రేమ ప్రస్తుతం బుల్లితెర మొత్తం పాకిపోయింది. కేవలం ఈటీవీ లో మాత్రమే కాదు వేరే ఛానల్లో ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు అదే రీతిలో వీరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక వీరిద్దరూ ఒకరి మీద ఒకరు ప్రేమను వ్యక్తపరిచే తీరు కూడా ఎంతో మందిని ఆకర్షిస్తోంది.

 సుడిగాలి సుధీర్, రష్మీ పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక వీరి పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకానొక సమయంలో ఈ టివి లో ప్రసారమైన ఒక కార్యక్రమంలో తమ తొమ్మిదేళ్ల ప్రేమకు గుర్తుగా రష్మీ సుధీర్ కు తొమ్మిది రకాల బహుమతులు ఇస్తుంది అనే విషయం తెలిసిందే   అప్పట్లో ఈ పర్ఫామెన్స్ బుల్లితెర ప్రేక్షకులందరికీ తెగ నచ్చేసింది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఇకపోతే ఇటీవలే ఈ పర్ఫామెన్స్ పై స్ఫూఫ్  చేశాడు హైపర్ ఆది. ఇటీవలే విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో భాగంగా తాను కూడా హీరోయిన్ ఈషా కోసం 11 గిఫ్టులు ఇస్తాను అంటూ ఒక పర్ఫామెన్స్ చేశాడు. అయితే ఆ తర్వాత రష్మీ సుధీర్ లవ్ గురించి మాట్లాడుతూ మీరు సరిగ్గా లవ్ చేసుకుని ఉంటే ఈ పాటికి మీకు ఎంగేజ్మెంట్ అయ్యేది పెళ్లి అయ్యేది పిల్లలు కూడా పుట్టే వారు. అప్పుడు 9 గిఫ్టులు ఏంటి 90 గిఫ్టులు వచ్చేది అంటూ కామెంట్ చేస్తాడు హైపర్ ఆది. హైపర్ ఆది చెప్పింది కరెక్ట్ అంటూ అటు రష్మీ సుధీర్ అభిమానులు కూడా కామెంట్లు పెడుతూనే ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: