టాలీవుడ్
ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న
హీరోయిన్ లలో ఒకరు అయినా
లావణ్య త్రిపాటి తాజాగా రితీశ్
రానా దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ బర్త్ డే
మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ ని కొన్ని రోజుల క్రితం జులై 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఆ తర్వాత ఈ
మూవీ ని చెప్పిన తేదీ కంటే ముందు గానే అనగా జూలై 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొంత కొన్ని రోజుల క్రితమే అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ఇలా ఈ
సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్ లను వేగవంతం చేసింది. అందులో భాగంగా హ్యాపీ బర్త్ డే
సినిమా ట్రైలర్ ను ఈ రోజు అనగా
జూన్ 29 వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఏ ఎం బి సినిమాస్ స్క్రీన్ 1 లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ
సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా ట్రైలర్ లాంచ్
ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ ట్రైలర్ లాంచ్
ఈవెంట్ కు
టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ దర్శకుడు అయిన
ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా రానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
మరి ఇప్పటి వరకు ఈ
సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మరి ఈ
సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
మత్తు వదలరా లాంటి సూపర్ సస్పెన్స్
థ్రిల్లర్ మూవీ తర్వాత రితీశ్
రానా దర్శకత్వం వహించిన
సినిమా కావడంతో హ్యాపీ బర్త్ డే సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.