చిరంజీవి ఏంటి ఇలా తయారయ్యాడు?

Purushottham Vinay
మెగాస్టార్ చిరంజీవి ఈమద్య కాలంలో ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద డిజాస్టర్‌ ను చవి చూసిన విషయం తెల్సిందే. ఆ సినిమా మరీ దారుణంగా ప్లాప్ అవ్వడంతో ఇక చిరంజీవి సినిమాల ఎంపిక విషయంలో ఒకింత జాగ్రత్త తీసుకుంటాడని అంతా కూడా భావించారు.కాని అసలు ఆయన మాత్రం కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇచ్చేస్తూ.. సినిమా చేసేద్దాం అని అంటున్నాడు. ఇప్పటికే ఏమాత్రం బజ్ లేని గాడ్ పాదర్‌ ఇంకా భోళా శంకర్ సినిమాలు చేస్తున్న చిరంజీవి మరో వైపు ఇంకో ఇద్దరు చిన్న దర్శకులకు సినిమా చేసే అవకాశం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మెగాస్టార్‌ చిరంజీవి స్టామినా కు తగ్గట్లుగా సినిమాలు చేసే దర్శకులు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇక అలాంటి వారికి ఛాన్స్ ఇవ్వకుండా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా అడ్డదిడ్డంగా కొత్త దర్శకులుకు డేట్లు ఇస్తే అన్ని ఆచార్య సినిమాలే అవుతాయి అంటూ విమర్శలు అనేవి వ్యక్తం అవుతున్నాయి. ఇక సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ విషయమై మెగా ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటున్నారు.


ఈ సమయంలోనే రొట్ట డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతికి కూడా డేట్లు ఇవ్వబోతున్నట్లుగా పక్కా కమర్సియల్‌ స్టేజ్ మీద చెప్పేశాడు. ఇక మొన్నటి వరకు బాలయ్యను భోళా అనే వారు.తన వద్దకు వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పి ఇక మీరు తోపు అంటే చాలు బాలయ్య డేట్లు ఇచ్చేవాడట. అందువల్లే బాలయ్య కెరీర్‌ లో ఎన్నో దారుణమైన పరాజయాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు బాలయ్య కాస్త గాడిన పడ్డట్లుగా ఉన్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆ ప్లేస్ ను ఆక్రమించినట్లుగా భోళాగా తయారు అయ్యాడు. ఈ విషయంలో చిరంజీవి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. చిరంజీవి ఫ్యాన్స్ ఇష్టానుసారంగా చిరు సినిమాలకు కమిట్ అవ్వడంను చాలా తప్పుబడుతున్నారు. మారుతి వంటి దర్శకుడితో సినిమా అవసరమా అంటూ కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: