సమంత పై నెటిజెన్ ల స్పందన చూసి భయపడుతున్న నిర్మాతలు...!!

murali krishna
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ బిజీగా ఉన్నారు. ఈమె విడాకుల తరువాత పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నారు.


ఇకపోతే సమంత ప్రస్తుతం నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉందట. ప్రస్తుతం ఈమె యశోద, ఖుషి వంటి సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇలా వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.


సోషల్ మీడియా వేదికగా నిత్యం తన సినిమాలకు సంబంధించిన అప్డేట్ విడుదల చేయడమే కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఈ మధ్యకాలంలో నెగిటివ్ కామెంట్ చేసేవారికి తనదైన శైలిలో సమాధానం చెబుతూ పూర్తి వ్యతిరేకతను ఏర్పరచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సమంత తీరు నచ్చని వారు సోషల్ మీడియా వేదికగా ఈమె పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారట.దీంతో సమంత పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.


ఇక సమంత పై ఏర్పడిన ఈ వ్యతిరేకత తాను నటించిన శాకుంతలం, యశోద వంటి సినిమాల పై ప్రభావం చూపుతుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట.. ముఖ్యంగా ఈ రెండు సినిమాలు 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. దీంతో నిర్మాతలలో కాస్త భయాందోళనలు ఏర్పడ్డాయనీ సమాచారం. ఇలా సమంత ఒకవైపు వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారట..


ఈ క్రమంలోనే ఈమె వ్యవహార శైలి పట్ల నెటిజన్లు కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు కురిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సమంత భారీ గ్లామర్ షో చేయడంతో ఇలాంటి విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. అయితే సమంత దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను బాగా ఉపయోగిస్తున్నారు.అందుకే వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఒకవైపు సినిమాలలోనూ మరోవైపు పలు మాగజైన్ కోసం ఫోటో షూట్ చేయడం, మరోవైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతులా డబ్బు సంపాదిస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: