NCPCR: పిల్లలని అలా చూపిస్తే కఠిన చర్యలే!

Purushottham Vinay
చిన్న పిల్లలతో సీరియల్స్ ఇంకా సినిమాల్లో రియాలిటీ షోల్లో టీవీల్లో ఓటీటీ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియా లో చూపించే కంటెంట్ లపై (NCPCR) నేషనల్ కమీషన్ ఫర్ ప్రొడటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కీలక ఆదేశాలను తాజాగా జారీ చేసింది.ఇక పిల్లలని అభ్యంతరకరంగా ఇబ్బంది కరంగా చూపించే ధోరణి ఇటీవల ఎక్కువైపోయింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నేషనల్ కమీషన్ ఫర్ ప్రొడటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కీలక ఆదేశాలను జారీ చేయడం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.తాజాగా ప్రకటించిన కొత్త గైడ్ లైన్స్ సినిమాలు టీవి రియాలిటీ షో,షార్ట్ ఫిల్మ్,ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఇంకా అలాగే వార్తా ఛానల్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ..లకు కొత్త గైడ్ లైన్స్ వర్తిస్తాయని కూడా NCPCR స్పష్టం చేసింది.


ఇక అంతే కాకుండా సైబర్ చట్టాలు పిల్లల హక్కులకు సంబంధించిన ఇతర చట్టాలను కూడా పరిగణలోకి తీసుకున్న తరువాతే కొత్త రూల్స్ ని సిద్ధం చేసినట్టుగా కమీషన్ తెలియజేసింది. ఇక NCPCR తాజా రూల్స్ ప్రకారం నిబంధనలు ఈ విధంగా వున్నాయి.మూడు నెలల కంటే తక్కువ వయసున్న పసికందులను అసలు తెరపై చూపించకూడదు. అయితే చనుబాలు.. రోగ నిరోధక శక్తి లాంటి అవగాహన కార్యక్రమాల కోసం మాత్రం మినహాయింపు అనేది వుంటుంది. ఇక ఈ నిబంధనను పాటించకుంటే మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. సినిమా సీరియళ్లు, ఓటీటీ ఇంకా ఇలా అన్ని కేటాగిరీలకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.ఇంకా అంతే కాకుండా చిల్డ్రన్ ఇన్ న్యూస్ మీడియా అనే కేటగిరీని ప్రత్యేకంగా చేర్చింది NCPCR. 


దీని ప్రకారం పిల్లలు న్యూస్ ఛానెల్స్ లేదంటే ఎంటర్ టైన్ మెంట్స్ పర్పస్ లో ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు కానీ వాళ్లకు ఇబ్బంది కలిగించేలా అసలు వ్యవహరించకూడదు. ముఖ్యంగా బాధితుల విషయంలో కూడా విజువల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే సంబంధిత ఛానెల్స్ పై శిక్షలు చాలా కఠినంగా అమలు చేయబడతాయి. ఇక ఈ గైడ్ లైన్స్ ప్రకారం నిర్భంధంలో పని చేయించుకోవడం తదితర అంశాలతో పాటు లేబర్ చట్టం ప్రకారం ఇక్కడ అది వర్తిస్తుంది.ఇంకా అలాగే సోషల్ మీడియా కూడా పిల్లలపై హింస విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కూడా కోరింది. ధూమపానం మధ్యపానంతో పాటు అత్యాచార బాధితులుగా ఇంకా లైంగిక వేధింపుల బాధితులుగా ఇబ్బందికర పరిస్థితులలో వారిని చూపించకూడదు.


భారీ భారీ డైలాగులతో సమాజంపై చెడు ప్రభావం చూపించేలా పాత్రలను డిజైన్ చేయడం కూడా మేకర్లు మానుకోవాలని మార్గదర్శకాల్లో సూచించించింది NCPCR. ఇక చివరగా ..2011 వ సంవత్సరంలో మార్గదర్శకాలను జారీ చేసింది NCPCR. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఇన్నేళ్ల తరువాత కొత్త చట్టాలు పాత నిబంధనల సవరణల ఆధారంగా భారీ మార్పులతో డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ని ప్రజాభిప్రాయ సేకరణ తరువాతే రూపొందించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: