బాలీవుడ్ స్టార్
హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో
అలియా భట్,
అమితాబ్ బచ్చన్ ఇంకా అలాగే
నాగార్జున వంటి స్టార్లు కీలక పాత్రలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసి
మూవీ 'బ్రహ్మాస్త్ర'.యస్ యస్
రాజమౌళి ఈ చిత్రానికి సమర్పకులు అనే అంశంతో ఈ
మూవీ తెలుగులో కూడా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది.అలాగే
మెగాస్టార్ చిరంజీవి తెలుగు వెర్షన్ కు వాయిస్ ఓవర్ అందించబోతున్నారు. మూడు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం
సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతుంది.ఈ మధ్యనే
సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ
మూవీ ట్రైలర్ కట్ బాగానే ఉంది కానీ అందులో
గ్రాఫిక్స్ మాత్రం చాలా కామెడీగా ఉన్నాయి.
గ్రాఫిక్స్ పై అవగాహన లేని ప్రేక్షకులు కూడా అనేక రకాల వంకలు పెట్టే విధంగా ఉన్నాయి ఇందులోని గ్రాఫిక్స్. ఈ
మూవీ పాన్
ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి కచ్చితంగా… ఆర్.ఆర్.ఆర్, బాహుబలి2, కేజీఎఫ్2 రికార్డుల్ని బ్రేక్ చేయాలని
బాలీవుడ్ ప్రేక్షకులు ఇంకా మేకర్స్ కోరుకుంటున్నారు. ఇక అలాంటి కామెంట్లకి మనం నవ్వుకోవచ్చు కానీ …అలాగే మన
టాలీవుడ్ స్టార్
హీరో ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' చిత్రానికి కూడా 'బ్రహ్మాస్త్రం' చిత్రానికి
గ్రాఫిక్స్ డిజైన్ చేసినవాళ్లే
గ్రాఫిక్స్ చేస్తున్నారు.
బ్రహ్మాస్త్ర సినిమాలానే.. ఆదిపురుష్
గ్రాఫిక్స్ కూడా ఉంటే సినిమాకి మొదట్లోనే నెగిటివిటీ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. 2023
సంక్రాంతి కానుకగా 'ఆదిపురుష్'
సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ
సినిమా 90 శాతం వరకు కూడా కేవలం
గ్రాఫిక్స్ పై డిజైన్ చేసిన సినిమానే.జక్కన్న
రాజమౌళి స్పూర్తితో మన తెలుగు దర్శకులు అయితే వి.ఎఫ్.ఎక్స్ విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ క్వాలిటీ ఔట్పుట్ ను రాబట్టుకుంటున్నారు.కానీ 'ఆదిపురుష్' సినిమాను తెరకెక్కిస్తోంది
బాలీవుడ్ దర్శకుడు. పోనీ ఇక అతనికి 10 సినిమాలు తీసిన అనుభవం ఉందా? అంటే అదీ కూడా లేదు. అందుకే 'ఆదిపురుష్'
సినిమా విషయంలో కూడా
ప్రభాస్ అభిమానులకి టెన్షన్ పట్టుకుంది.