అయ్యో!సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్నారుగా..!!
ఇక ఎప్పుడైతే సామ్, చైతో సపరేట్ అయ్యిందో అప్పటినుంచి అక్కినేని అభిమానులు ఆమెను తెగ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆమె ఏ పని చేసినా నెగెటివ్ గా చిత్రించి కామెంట్స్ లో నెగెటివ్ గా మాట్లాడుతునే ఉంటారు. ఇక కొన్ని కామెంట్స్ కు సమంత తనదైన రీతిలో కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ఒక నెటిజన్ మాట్లాడిన వల్గర్ వర్డ్స్ కు ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే.. సమంత మాజీ భర్త నాగ చైతన్య, హీరోయిన్ శోభితా దూళిపాళ్ల తో డేటింగ్ చేస్తున్నట్లు పలు ఇంగ్లీష్ వెబ్ సైట్స్ ప్రచురించాయట. అందులో ఏమున్నది అంటే.. 'మేజర్' హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్ చేసున్నాడని, ఒకటి రెండు సార్లు ఆమె ఉన్న హోటల్ కు కూడా చై వెళ్లడం.. చై ఇంటికి శోభితా వెళ్లడం కెమెరాల కంట పడినట్లు రాసుకొచ్చారట. అంతేకాకుండా త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా అభిప్రాయపడ్డారు. ఇక వార్తపై అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది సామ్ ను ట్రోల్ చేస్తూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అందులో ఒక నెటిజన్ సామ్ పై దారుణమైన కామెంట్స్ కూడా చేశాడు. ' సమంత ఒక వేశ్య.. బట్టలు విప్పి బజారులో తిరగమని చెప్పు.. ఈ ఐటెం దాని కోసం మా వాడు దేవదాసులా ఉండాలా..?' అంటూ కామెంట్ చేశాడు. ఇక ఈ కామెంట్ పై సమంత స్పందిస్తూ.. 'నిజంగా భయపడాలి' అని అంటూ రెండు స్మైల్ ఎమోజీలను కూడా జోడించింది. అంటే కొంచెం వెటకారంగా భయపడేది ఏమి లేదు అన్నట్లు చెప్పుకొచ్చిందట.. దీంతో వెంటనే సదురు నెటిజన్ దానిని డిలీట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ గా మారింది.