లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా
విక్రమ్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ సినిమాకు
లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా, ఈ
మూవీ లో ఫహాద్ ఫాజిల్ ,
విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలలో నటించగా , సూర్య గెస్ట్ రోల్ లో నటించాడు . ఈ
మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చాడు .
ఈ
సినిమా ఎన్నో అంచనాల నడుమ
జూన్ 3 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయ్యింది . భారీ అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయిన
విక్రమ్ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది . ప్రస్తుతం ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ
బ్లాక్ బస్టర్ విజయం వైపు దూసుకెళుతోంది . ఇది ఇలా ఉంటే
విక్రమ్ సినిమాకు ప్రేక్షకుల నుండి
బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో కమల్ హాసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన
లోకేష్ కనకరాజు కారును బహుమతిగా ఇచ్చాడు . అలాగే ఈ సినిమాలో రోలెక్స్ పాత్రలో నటించిన
సూర్య కు రోలెక్స్ వాచ్ ను
గిఫ్ట్ గా ఇచ్చాడు . అలాగే ఈ సినిమాకు పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు
బైక్ లను
గిఫ్ట్ లుగా ఇచ్చాడు .
ఇలా ఈ సినిమాకు పని చేసిన చాలా మందికి గిఫ్ట్లను ఇచ్చిన కమల్ హాసన్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందించిన అనిరుద్ రవిచంద్రన్ కు మాత్రం ఎలాంటి గిఫ్టు ఇవ్వలేదు. అయితే తాజాగా కమల్ హాసన్ నుండి తనకు గిఫ్టు రాకపోవడంపై అనిరుద్ ఓ ఇంటర్వ్యూ స్పందించాడు. అనిరుధ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కమల్ హాసన్
మూవీ కి పని చేయడమే పెద్ద
గిఫ్ట్ అని చెప్పుకొచ్చాడు.